డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం ఆర్టీసీ డిపోలో శ్రీ సత్యసాయి రీజియన్ లోనే ఉత్తమ ప్రతిభ ఘనపరిచిన కండక్టర్ సివిఆర్ రెడ్డి (ఈ 403713), జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ కండక్టర్గా ప్రశంసా పత్రమును 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా పుట్టపర్తిలో అందుకున్నారు. అదేవిధంగా ఉత్తమ డ్రైవర్గా ఎస్. ఈశ్వరయ్య (ఈ. 406102), కండక్టర్ గా ఎస్, బాబు (ఈ. 576741), డిపిటిఓ మధుసూదన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. అలాగే ధర్మవరం డిపో మేనేజర్ చేతుల మీదుగా జిపి. రెడ్డి-టిఐ- 3, బుల్లె ఆదినారాయణ-ఎల్ హెచ్, కె తిరుమలేష్ కండక్టర్ (ఈ. 576742) ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఉత్తమ ప్రశంసా పత్రాలు అందుకున్న ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.