విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని పలుచోట్ల తిరుపతికి చెందిన హ్యాండ్లూమ్స్ ఆర్ డి డి అధికారి రాజారావు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రామ్ నగర్, కొత్తపేట, పోతుకుంటలలో గల ఫ్యాక్టరీలను వారు ఆకస్మికంగా తనిఖీ చేస్తూ రిజర్వేషన్ చట్టం ప్రకారం ఉన్నాయా? లేదా? నియమాలను ఉలన్గిస్తున్నారా? అన్న విషయాలపై వారు ఆరా తీశారు. ఇందులో రామ్ నగర్ కు చెందిన పెద్దరాజు ఫ్యాక్టరీలో ప్యూర్ టు ప్యూర్ చీరలు నేస్తున్నారన్న, అతనిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఇకనుంచి ప్రతి రోజు దాడులు ఉంటాయని తెలిపారు. తమ ఆకస్మిక పర్యటన వివరాలను పట్టణంలోని పలు వ్యాపారస్తులు ముందుగానే తెలుసుకొని తాళాలు వేసుకొని పోతున్నారని తెలిపారు. ఇకనుంచి ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు దాడులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం ధర్మారంలో ఎడిగా సుబ్రహ్మణ్యం నియమించడం జరిగిందని, ఏదైనా ఫిర్యాదులు తెలియజేయాలంటే వారికి తెలియజేయాలని తెలిపారు. అదేవిధంగా నాగులురు గ్రామంలో ఉన్నటువంటి జింక రామాంజనేయులు ఫ్యాక్టరీలు కూడా ఆకస్మిక తనిఖీ చేశామని, వాటి వివరాలను అక్కడ జరుగుతున్న వాటిని జిల్లా ఉన్నతాధికారులకు సంబంధిత మంత్రికి కూడా తమ సమాచారాన్ని అందిస్తున్నామని తెలిపారు. కానీ ఇటీవలే జింకా రామాంజనేయులు యొక్క ఫ్యాక్టరీ పై పలు ఆరోపణలు, పలు పత్రికల్లో రావడం జరిగింది. అంతేకాకుండా సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు కూడా వీటిని తీవ్రంగా ఖండిస్తూ, జింక రామాంజనేయులు పైన తప్పనిసరిగా చర్యలు తీసుకొని చేనేత కార్మికులను ఆదుకోవాలని వారు తెలిపిన విషయం పాఠకులకు విధితమే. జింక రామాంజనేయులు ఫ్యాక్టరీలో ఆకస్మిక తనిఖీ విషయాలను రాజారావు అధికారి పూర్తి వివరాలు తెలియజేయలేకపోయారు. జింక రామాంజనేయులు ఫ్యాక్టరీ తనిఖీ చేసిన విషయాలు, అక్కడ తెలుసుకునే విషయాలను సంబంధిత ఉన్నతాధికారులకు, మంత్రి సవిత దృష్టికి తీసుకొని వెళ్లి అనంతరం వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నై రీజినల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ మనోహర్, టెక్నికల్ ఆఫీసర్ షణ్ముగం, స్థానిక ఎయిర్ఫోర్స్మెంట్ ఏడీ సుబ్రహ్మణ్యం, డెవలప్మెంట్ ఆఫీసర్ భాస్కర్, డిప్యూటీ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ సీనా నాయక్, తదితరులు పాల్గొన్నారు.