శ్రీ లలితా నాట్య కళానికేతన్ నాట్య గురువులు బాబు బాలాజీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో ఇటీవల వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణంలోని ప్రియాంక నగర్ లో బోయ రమేష్ వారి మిత్రబృందం ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్య గురువులు బాబు బాలాజీ కమలా బాలాజీ రామ లారీత్యా శిష్యులు తమ నాట్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నాట్య ప్రదర్శన ప్రేక్షకులను, భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఏకధాటిగా 15 మంది నాట్య ప్రదర్శన చేయడంలో అందర్నీ ముగ్ధుల్ని చేసింది. తదుపరి నిర్వాహకులు గురువులను సన్మానించి పిల్లలకు జ్ఞాపికలను అందజేశారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు గురువు బాబు బాలాజీ కృతజ్ఞతలను తెలియజేశారు.