-ఎంపీడీఓ సాల్మన్
విశాలాంధ్ర-రాప్తాడు : భారతజాతి ఐక్యతను చాటేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందడుగు వేద్దామని ఎంపీడీఓ సాల్మన్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర ఉత్సవాల సందర్భంగా మంగళవారం రాప్తాడు జడ్పీహెచ్ఎస్ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శిలాఫలకం ఆవిష్కరించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఆంధ్రుడైన పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను మనమందరం గౌరవించాలని, దేశభక్తి కలిగి ఉండాలన్నారు. నాడు 38 కోట్ల భారతీయులను ఒక్క తాటిపై తీసుకువచ్చింది ఈ జాతీయ జెండానేనన్నారు.
దేశ స్వాతంత్య్ర ఉద్యమ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతిఒక్కరిలోనూ జాతీయతా భావం, ఐకమత్యం, జాతీయ సమగ్రత పెంపొందాలన్నారు.
కార్యక్రమంలో హెచ్ఎం సాంబశివుడు, సర్పంచ్ సాకే తిరుపాలు, టీడీపీ మండల కన్వీనర్ పంపుకొండప్ప, పీడీ కేశవమూర్తి, స్కూల్ కమిటీ ఛైర్మన్ గంజి లక్ష్మీదేవి, వైస్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ కన్వీనర్ సాకే నారాయణస్వామి, సాకే జయరాముడు, పీ ఓ సావిత్రి, ఈసీ మురళి, టెక్నికల్ అసిస్టెంట్ నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ తలారి శివ, దండు మురళీ, గేట్ సత్తి, దేవర శ్రీరాములు, గాలి లక్ష్మీనారాయణ, డీలర్లు దండు నరేంద్ర, వరికూటి రవి, విద్యార్థులు పాల్గొన్నారు.