Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 11, 2024
Wednesday, September 11, 2024

తెలుగు భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర -అనంతపురం : తెలుగు భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారు. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో గురువారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ మరియు గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మరియు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలుగు అనేది మన భాష అని, తాను కర్ణాటక నుండి వచ్చి తెలుగు నేర్చుకున్నానని, ప్రతి సమావేశంలో, పర్యటనలలో తెలుగులోనే మాట్లాడుతున్నానన్నారు. తీయనైన తెలుగు భాషని ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటుందని, గోదావరి జిల్లాలో అక్కడ, ఇక్కడ, ఎక్కడున్నారండి అని వాడుక భాష ఉంటుందని, అదే రాయలసీమకు వచ్చేసరికి ఆడ, ఈడ, యాడున్నావ్ అని వాడుతుంటాం అని, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాడుక భాష అయిన తెలుగులో మాట్లాడటం జరుగుతుంటుందని తెలిపారు. మన తెలుగు భాషను అభివృద్ధి చెందుటకు జిల్లా యంత్రాంగం తరఫున సహాయ సహకారాలు అందిస్తూ అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే వివిధ కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరించే వారికి, తెలుగులో మాట్లాడే వారికి, తెలుగులో పాడేవారికి, తెలుగు సాంస్కృతిక ఇతర కార్యక్రమాలు చేసేవారికి ప్రోత్సాహం అందిస్తామన్నారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం 5కె రన్ నిర్వహించడం జరిగిందని అందులో గెలిచిన వారికి ఈరోజు సాయంత్రం   బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ, యోగ, ఎక్సర్సైజ్, ఏదో ఒక క్రీడలను ప్రతిరోజు అరగంట పాటు చేయాలని, తద్వారా ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, శరీర దృఢత్వం ప్రశాంతత కలుగుతాయని తెలియజేశారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. జాతీయ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం సంతోషించదగ్గ విషయం అన్నారు.
అనంతరం జిల్లాస్థాయ స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ – 2023 అందజేశారు.
మొదటి స్థానం : జడ్పీహెచ్ఎస్ బి కే సముద్రం విద్యార్థులు.
రెండవ స్థానం: ఎంజెపి. ఏపీ.బీసీ డబ్ల్యఆర్ఎస్  ( బాలురు) పెన్నఅహోబిలం పాఠశాల విద్యార్థులు. మూడవ స్థానం : ఏపీ మోడల్ స్కూల్, గార్లదిన్నె విద్యార్థులు.
నాలుగవ స్థానం : జడ్పీహెచ్ఎస్ కొనకొండ్ల విద్యార్థులు.
ఐదవ స్థానం : జడ్పీహెచ్ఎస్ పాల్తూరు, విద్యార్థులకు అవార్డులను జిల్లా కలెక్టర్, జడ్పి చైర్ పర్సన్ ప్రధానోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డీఈవో వరలక్ష్మి, డిప్యూటీ డిఈవోలు, జిల్లా అధికారులు, పిఈటిలు, విద్యా క్రీడా శాఖ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img