రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్. ఎస్. నరసింహులు
విశాలాంధ్ర-ధర్మవరం:: అన్ని దానముల కన్నా రక్తదానం నేత్రదానం ఎంతో ముఖ్యమైన దానము అని రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ ఎస్. నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మధు కంటి వైద్యశాలలో వారు జాతీయ నేత్రదాన పక్షోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తదుపరి నేత్రదానం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పక్షోత్సవాలు ఈనెల 25 నుండి సెప్టెంబర్ 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రక్త దానము చేస్తే మరొకరికి , అదే నేత్రదానం చేస్తే ఇరువురికి కట్టి చూపు లభిస్తుందని తెలిపారు. సమాజంలో అందరూ కూడా రక్త ,నేత్ర దానముల పట్ల పూర్తి అవగాహన చేసుకోవాలని తెలిపారు. వ్యక్తి చనిపోయిన 6 గంటలలోపు రక్త బంధువులు, దగ్గరలోని నేత్ర నిధికి గాని,, కళ్ళు సేకరించే కేంద్రానికి గాని, స్వచ్ఛంద సంస్థల వారికి గాని సమాచారాన్ని అందించాలని తెలిపారు. నేడు శరీరంలోని అభయముల దానము రోజువారి కార్యక్రమం అయ్యిందని, అందులో ముఖ్యమైనవి మూత్రపిండాలు, గుండె, కాలేయము అని తెలిపారు. వీటిని బ్రతికున్న వారు దానం చేస్తే అవసరమున్నవారికి అమర్చడం జరుగుతుందని తెలిపారు. నేత్రదానానికి అన్ని వయసుల వారు అర్హులేనని తెలిపారు. చక్కెర వ్యాధిగ్రస్తులు, కంటి శుక్లము ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా కళ్ళు దానము చేయవచ్చును అని తెలిపారు. పచ్చకామర్లు,, ఎయిడ్స్, క్యాన్సర్, పిచ్చికుక్క కాటు వలన మృతి చెందిన వారు కళ్ళు నేత్రదానానికి పనికిరావు అని తెలిపారు. కాబట్టి ప్రజలందరూ నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి సమాజాన్ని ప్రోత్సహిస్తే, చూపులేని నిర్భాగ్యుల జీవితాలకు వెలుగును ప్రసాదించిన వారు అవుతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటి పట్ల ప్రత్యేక శ్రద్ధను వహిస్తూ కంటిని సంరక్షించుకోవాలని తెలిపారు. నేటి యువతి యువకులు నేత్రదానంపై ప్రజలందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.. కాబట్టి నేత్రదానమును విస్తృతంగా ప్రచారం చేయవలసిన బాధ్యత అందరిమీద ఉందని తెలిపారు. పుట్టు గుడ్డివానికి కనుచూపు రాదు అని తెలిపారు. నేడు శరీర అవయదానము కూడా ముఖ్యముగా సమాజంలో మారిందని, శరీర అవ య దానాలు మెడికల్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థి స్థాయి నుంచి నేత్ర దానం రక్తదానంపై ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తూ సమాజమును ప్రోత్సహించినప్పుడే మంచి ఫలితం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యాధికారి ఉరుకుందప్ప, ఆప్తాలమిక్ అసిస్టెంట్ సికిందర్ పాల్గొన్నారు.