విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం పట్టణంలోని ఆర్డిటి మైదానంలో మూడవరోజు కూడా జరుగుతున్న శ్రీ అటల్ బిహారి వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. శనివారం జరిగిన ఐదు మ్యాచుల్లో పది జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్ మారుతీ నగర్ పార్క్ 11 కి మాల్యవంతం టీం మధ్య జరిగగా మ్యాచ్లో మాల్యవంతం టీం మీద మారుతీ నగర్ పార్క్11 58 పరుగులు తేడాతో గెలుపొందింది.
రెండవ మ్యాచ్ గేమ్ చేంజర్స్ కనగానపల్లె టీం కి దంపెట్ల టీం మధ్య జరిగిన మ్యాచ్లో గేమ్ చేంజర్స్ కనగానపల్లె టీం మీద దంపేట్ల టీం 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మూడవ మ్యాచ్ గొట్లురు టీం కి ద్రావిడ్11 టీం మధ్య జరిగిన మ్యాచ్లో ద్రావిడ్11 టీం మీద గొట్లూరు టీం 34 పరుగుల తేడాతో గెలుపొందింది.
నాలుగవ మ్యాచ్ ఆత్మకూర్ టీం కి ఇండియన్ 11 కె టి సి కి మధ్య జరిగిన మ్యాచ్లో ఆత్మకూర్ టీం మీద ఇండియన్ 11 కె టి సి టీం 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఐదవ మ్యాచ్ ప్రతాప్ 11 టీం కి ధర్మవరం ఇస్లాం 11 టీం మధ్య జరిగిన మ్యాచ్లో ఇస్లాం 11 టీం మీద ప్రతాప్ 11 టీం 13 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ ఐదు మ్యాచుల్లో తమ ప్రతిభను చూపిన మారుతీ నగర్ పార్క్ 11 రాజేష్ కుమార్, దంపెట్ల వీరు, గోట్లూరు టీం పవర్ బుల్లెట్ పవన్ కళ్యాణ్,ఇండియన్ 11 కె టి సి అజ్జు, ప్రతాప్ 11 నేత్ర అనే ఐదుగురు ఆటగాళ్లకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో మంత్రి గారి కార్యాలయ సిబ్బంది హరీష్, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి చెర్లోపల్లి నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.
నాలుగవ రోజు హోరా హోరీగా జరిగిన క్రికెట్ మ్యాచ్;; పట్టణంలోని తారకరామాపురం నందు ఆర్డిటి మైదానంలో అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ టోర్నమెంట్ నాలుగవ రోజు కూడా ఉత్సాహపరితంగా కొనసాగింది. ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఆధ్వర్యంలో నాలుగవ రోజు ఫ్రెండ్స్ 11 టీముకు పవన్ లెవెన్ కే టి సి టి మధ్య పోటీలో ఫ్రెండ్స్ ఎలవెన్ కే టి సి గెలుపొందడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన టీంకు హరీష్ బాబు చేతులమీదుగా శీలుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి లీడర్ మిరియాల అంజి, డోలా రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.