విశాలాంధ్ర -ధర్మవరం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నందు రెండవ రోజు వాలీబాల్,ఖో ఖో , కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్ నిర్వహించడం జరిగిందని నియోజకవర్గ కోఆర్డినేటర్ నాగేంద్ర తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
అండర్ 17 వాలీబాల్ బాలుర విభాగంలో ధర్మవరం విజేతగా తాడిమర్రి రన్నర్స్ గా,
అండర్ 14 కబడ్డీ బాలర విభాగంలో బత్తలపల్లి విజేతగా ధర్మవరం రన్నర్స్ గా,
అండర్ 17 కోకో బాలుర విభాగంలో ధర్మవరం విజేతగా ముదిగుబ్బ రన్నర్స్ గా,
అండర్ 14 బాడ్మింటన్ బాలికల విభాగంలో ధర్మవరం విజేతగా
తాడిమర్రి విన్నర్స్ గా నిలవడం జరిగింది అని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో సెలక్షన్ అయిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ రఘునాథరావు, వ్యాయామ ఉపాధ్యాయులైన నారాయణస్వామి లక్ష్మీనారాయణ మల్లేష్ లాల్ బాషా శాంత లింగం రేఖ తదితరు వ్యాయామ ఉపాధ్యాయులందరూ పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.