జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తారకరామా పురానికి చెందిన వికలాంగుడైన నాగేంద్రకు ఆర్థిక ఇబ్బంది ఉన్నందువలన, ఆ కుటుంబానికి పదివేల రూపాయల ను ఆర్థిక సహాయంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మిరియాల లక్ష్మీనారాయణ కడపల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాధితులు మాట్లాడుతూ ప్రస్తుతం నాగేంద్ర ఆటో తో జీవనం కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, ఆటోల ఆదాయం కూడా తక్కువగా రావడం వల్ల, నలుగురు పిల్లలు యొక్క జీవనం కొరకు ఆర్థిక సహాయం అడగడం జరిగిందని తెలిపారు. తదుపరి చిలకం మధుసూదన్ రెడ్డికి నాగేంద్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలను తెలియజేశారు.