మానస నృత్యా సాంస్కృతిక సంఘం గురువు సహాయం
విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల విజయవాడలో భారీగా వరదలు రావడంతో విజయవాడ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ, తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేకుండా పోవడం జరిగింది. విజయవాడ వాసులను ఆదుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛంద సంస్థలు వ్యాపారస్తులు తామున్నామంటూ వారు ముందుకు వచ్చి తమదైన శైలిలో జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నారా లోకేష్ కు నగదు లేదా చెక్కులను అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మానస నృత్యా సాంస్కృతిక సంఘం గురువు మానస గత కొన్ని రోజులుగా విజయవాడలో వచ్చిన వరదకు తమ వంతుగా సహాయం చేయుటకు తమ నృత్య కార్యాలయము ద్వారా ప్రజల ద్వారా భిక్షాటన చేసి, రూ.20,650 లను ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి కు చెక్కును అందజేశారు. అనంతరం మానస ఆర్డీవోను వారు ధర్మవరం డివిజన్లకు చేస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకొని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో చదువుతోపాటు భారతీయ సంస్కృతి కలలను ఇనుమడింప చేసే విధంగా చిన్నారులకు నేర్పడం అభినందించేదగ్గ విషయమని, మనకళల ను మరిచిపోకుండా ఉండేందుకు భావితరాలకు అందించడం శుభదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానస తల్లిదండ్రులతో పాటు నృత్య చిన్నారి కళాకారులు పాల్గొన్నారు.