విశాలాంధ్ర -ధర్మవరం:: ఇటీవల విజయవాడ ప్రాంతంలో తీవ్రమైన వరదలు రావడం, వేలాదిమంది ప్రజలు తమ ఆస్తులను నష్టపోవడం, కట్టుబట్టలతో బయటపడటం, అన్నమో రామచంద్ర అంటూ ఆకలి దాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం శ్రీ సత్య సాయి జిల్లాలోని కొంతమంది ఉన్నతాధికారులను విజయవాడలోని గొల్లపూడి ప్రాంతంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపాలన్న ఆదేశాల మేరకు ధర్మవరం ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి తో పాటు పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, కదిరి ఆర్డీవో వంశీకృష్ణ, డిఆర్డిఏ పిడి నర్సయ్య, డి ఎల్ డి వో శివారెడ్డి, జడ్పీ సీఈవో లలిత భాయి లతోపాటు మరికొంతమంది ఈనెల 8వ తేదీ నుండి గొల్లపూడి ప్రాంతంలో జరిగిన నష్టాలను అంచనా వేస్తూ విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము వెళ్లిన చోట తీవ్రమైన నష్ట వాటిలిందని, వాటి వివరాలను మరికొన్ని రోజులు పాటు ఇక్కడే ఉండి అంచనా వేయడం జరుగుతుందని తెలిపారు. అక్కడ ఉన్న గృహాలు వ్యాపార సంస్థలు ఫుడ్ ప్యాకింగ్ గోడౌన్లు తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు. బాధితులందరినీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదుకోవడం మా బాధ్యత అని వారు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు అంచనా నివేదికలను తయారుచేసి, చివరన దూది పట్టికలను విజయవాడ కలెక్టరేట్ కార్యాలయానికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. బాధితులతో స్వయంగా ఈ అధికారులు మాట్లాడి నష్టం యొక్క అంచనాను తెలుసుకొని నివేదికలు తయారు చేస్తుండడం పై అక్కడి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.