ఆశ్రమ నిర్వాహకులు ప్రపుల్ల చంద్ర
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని చంద్రబాబు నగర్ కు చెందిన షాకే నారాయణ, సాకే నారాయణమ్మల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సాకేశ్వరయ్య, సాకే పద్మావతి మండల పరిధిలోని గొట్లూరులో గల అనాధాశ్రమంలో అన్నదానంతో పాటు వస్త్రధానమును పంపిణీ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేపట్టడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబములో నిర్వహించే శుభకార్యాలకు, పుట్టినరోజులు కు అనాధాశ్రమంలో భాగస్వామ్యంగా చేసుకోవాలని తెలిపారు. తదుపరి ఆశ్రమ నిర్వాహకులు ప్రఫుల్ల చంద్ర కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, లక్ష్మీనరసింహ, నరేంద్ర, శిరీష, అక్కులప్ప, జ్యోతి, హేమలత ,హాసికా, మనవళ్లు, మనవరాలు పాల్గొన్నారు.