శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ అధ్యక్షులు వీరనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాయి నగర్లో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో పలు రకాలుగా వివిధ సేవలను అందిస్తూ పేద ప్రజలకు విశేష సేవలను అందిస్తోంది. ఇందులో భాగంగానే ఆలయ కమిటీ అధ్యక్షులు వీరనారాయణ, కార్యదర్శి రామలింగయ్య, ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, డైరెక్టర్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ పట్టణంలో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని ఓ రెండు రోజులు పెట్టుకునేందుకు ఫ్రీజర్ బాక్స్ అవసరం ఎంతో ఉంది అని, ఈ ఫ్రీజర్ బాక్స్ కొరకు పేదలు .తమ కుటుంబంలో మరణిస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని షిరిడి సాయిబాబా కమిటీ వారు గుర్తించి, బాబా గుడిలో మూడు ఫ్రీజర్ బాక్సులను సిద్ధం చేశామని,ఈ ఫ్రీజర్ బాక్స్లను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. కేవలం రవాణా ఖర్చు మాత్రమే సంబంధిత వ్యక్తి పెట్టుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఏ కుటుంబంలోనైనా వ్యక్తి చనిపోతే ఫ్రీజర్ బాక్స్ కొరకు సెల్ నెంబర్ 9985265364కు గాని 9493435310 సంప్రదించాలని తెలిపారు.