విశాలాంధ్ర- ధర్మవరం : వినాయకుని లడ్డు వేలంపాట ద్వారా తనకు లభించడం మహాభాగ్యము అని పోలా రామకృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని 16వ వార్డు సచివాలయం వెనుక గల వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన వినాయక చవితి పండుగను విజయవంతం చేసిన వారందరికీ పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. వినాయక స్వామివారి మహా ప్రసాదమైన లడ్డును పోలా రామకృష్ణయ్య.. సీఏ.. రూ.1,40,000 కు దక్కించుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా మొదటి వెండి కాయిన్ చింత ఎల్లయ్య అండ్ సన్స్ వారు రూ.32,500 కు దక్కించుకోగా రెండవ కాయిన్ పోలా చిన్న రాముడు అండ్ సన్స్ వారు రూ.37,600 కు దక్కించుకోవడం జరిగిందన్నారు. అనంతరం వీరందరిని కమిటీ తరఫున ఘనంగా సన్మానించారు