విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనుల గుర్తింపు పై గ్రామ సభను ఈ నెల 23వ తేదీ మొత్తం 20 పంచాయతీలకు గాను 15 పంచాయతీలలో ఉదయం 11 గంటలకు మిగిలిన 5 పంచాయతీలలో మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అబ్దుల్ నబీ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ సర్పంచ్ అధ్యక్షతన ఈ గ్రామ సభలు నిర్వహిస్తామని, అందరికీ తగిన సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ గ్రామ సభలో ప్రభుత్వం మండలమునకు కేటాయించిన మూడు కోట్ల రూపాయలతో సిమెంటు రోడ్లు నిర్మించుటకు పనులను గుర్తించడం జరిగిందని తెలిపారు. గుర్తించిన పనులను గ్రామసభయందు ఆమోదం పొందవలసి ఉందని, అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో 38 రకముల వ్యవసాయ అనుబంధ పనులను(జాబితా ప్రకారం) రైతు అవసరాల మేరకు ప్రతిపాదనలు గైకొని ఆమోదం పొందాల్సి ఉందని తెలిపారు. కావున రైతులు ఉపాధి హామీ కూలీలు విరివిరిగా పాల్గొని వారి అవసరం మేరకు పనులను ప్రతిపాదించి ఆమోదం పొందాలని తెలిపారు. తప్పనిసరిగా గ్రామస్థాయిలో పనిచేయు అన్ని శాఖల సిబ్బంది ఈ గ్రామ సభలకు పాల్గొనవలెనని వారు తెలిపారు.