విశాలాంధ్ర – ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రముఖ నాయకురాలు తెలంగాణా భూ పోరాట ఉద్యమ నాయకురాలు చాకలి చిట్యాల ఐలమ్మ వర్ధంతి వేడుకలు మంగళవారం ధర్మవరం గొట్లూరు గ్రామం లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా రజక అభివృద్ధి సంస్థ ధర్మవరం పట్టణ శాఖ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరి అగ్రహారం ముత్యాలు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.ముందుగా మహిళలు తమ ఉద్యమ నేత చాకలి ఐలమ్మ చిత్రపటాన్ని ఊరేగించారు. బోనాలు తలపై పట్టుకుని పెట్టుకొని గంగమ్మ పూజలు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ పోలుగల్లు కమ్మన్న వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి పి పార్వతి,పట్టణ అధ్యక్షులు న్యామద్దల నరసింహులు తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఉప్పు దేవర నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జి శ్రీరాములు శేఖర,సి.రామాంజి,ఎమ్.అదెప్ప,,బి గంగాధర మహిళలు,శ్రీమతి వరలక్ష్మి శ్రీమతి పద్మావతి శ్రీపతి శాంతమ్మ బి సుజాత అధిక సంఖ్యలో పాల్గొన్నారు..