విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బాలాజీ విద్యా సంస్థల అధినేత పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు విద్యార్థులు, అధ్యాపకులు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి మాట్లాడుతూ పల్లె రఘునాథ్ రెడ్డి విద్యా విషయంలో సాధించిన విజయాలను గూర్చి తెలియజేశారు. అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, అందరి మన్ననలు పొందడం జరిగిందన్నారు. మున్ముందు మరింత అభివృద్ధి బాటలో పల్లె రఘునాథ్ రెడ్డి వెళతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.