Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ఘనంగా గురు పూజోత్సవం..

విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలోని డ్రామా హాల్ లో గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవము – 2024, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారతరత్న, భారత ద్వితీయ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, అనంత జిల్లా పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మినారాయణ, జెడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు, తదితరులు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ఎంపీ, జడ్పి చైర్ పర్సన్, ఎమ్మెల్యేలను జిల్లా కలెక్టర్ సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ గురు పూజోత్సవము సందర్భంగా గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గురువులకు సంబంధించి గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ గురువు గురించి కీర్తింపబడ్డారని, వైద్యుల కంటే గురువులు ఎక్కువనే శాస్త్రంలో కూడా రాశారన్నారు. అన్ని శాఖల్లోనూ, అడ్మినిస్ట్రేషన్, అన్ని చోట్ల గురువులు ఉంటారని, గురువు లేకపోతే ప్రపంచమే లేదన్నారు. ఉపాధ్యాయులంతా ఎంతో చిత్తశుద్ధితో పనిచేయాలని, విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన చేయాలని, వారికి గైడ్, ఫిలాసఫర్ లా ఉపాధ్యాయులు మార్గనిర్దేశకత్వం చేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురు పూజోత్సవము కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, భారతరత్న, భారత ద్వితీయ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా విశేష ప్రతిభ ఉన్న, సేవ చేసిన గురువులకు, ఎంఈఓలకు సన్మానం చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా అనంత జిల్లా పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మినారాయణ మాట్లాడుతూ గురు పూజోత్సవము సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక స్థానం ఉందన్నారు.
ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువులు పట్ల చూపిన గౌరవం ఆదర్శనీయమని అన్నారు. సమాజంలో ఎంత మార్పు వచ్చినా, సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, అదంతా ఉపాధ్యాయులు నేర్పిన పాఠాల వల్లనే అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.
రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ గురు పూజోత్సవము సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయలకు పురస్కారము అదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వారంతా ఉత్తమ విద్యాబోధన చేయాలన్నారు.
ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ బావి పౌరులకు విద్య, విజ్ఞానాన్ని అందించే సరైన దిశా నిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి, జడ్పీ సీఈవో ఓబులమ్మ, డీఈవో వరలక్ష్మి, డివిఈఓ వెంకటరమణ నాయక్, సమగ్ర శిక్ష ఏపిసి నాగరాజు, విద్యాశాఖ వారి సిబ్బంది, ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మరియు పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img