శ్రీ అమృత సాయి హాస్పిటల్ ఎండి జీ రాఘవేంద్ర కుమార్
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ఎస్ఎల్వి మార్కెట్ పాత బస్టాండ్ వద్ద గల శ్రీ అమృత సాయి హాస్పిటల్ లో ఉచిత గుండె వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని హాస్పిటల్ ఎండి రాఘవేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గుండె వైద్య శిబిరానికి డాక్టర్ ఆశిక్ తో పాటు మరో ఐదు మంది వైద్యులు పాల్గొని గుండె జబ్బు రోగులకు తగిన వైద్య చికిత్సలను ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి 90 మంది రోగులు పాల్గొనడం జరిగిందని, వారికి గుండె పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను, సలహాలను, తగిన మందుల వివరాలను కూడా తెలపడం జరిగిందని తెలిపారు. ఈ గుండె వైద్య శిబిరం అనంతపురంలోని మార్క్ సూపర్ స్పెషాలిటీ గుండె ఆసుపత్రి వారి సహాయ సహకారములతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ హాస్పిటల్ లో ఎన్టీఆర్ వైద్య సేవ సదుపాయం కూడా కలదని తెలిపారు. గుండె దడ, నొప్పి, చాతినొప్పి, ఆయాసం, కళ్ళు తిరగడం, గుండెలో మంట కలగడం, చాతి బరువుగా ఉండడం, నిద్రలో ఆయాసం వచ్చి లేచి కూర్చోవడం, కాళ్లు వాపు రావడం, చెమటలు పట్టడం లాంటి సమస్యలకు 6 మంది డాక్టర్లచే వైద్య చికిత్సలతో పాటు వైద్య సలహాలు కూడా అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమృత సాయి హాస్పిటల్స్ సిబ్బంది జయలక్ష్మి, సోనీ, రోగులు పాల్గొన్నారు.