అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ కు సిపిఐ నగర్ సమితి వినతులు
విశాలాంధ్ర- అనంతపురం : అనంత నగర పాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్ కల్పనజోష్ కాలనీ మరియు 24వ డివిజన్ చండ్ర రాజేశ్వరరావు కాలనీ మరియు 40 డివిజన్ పార్వతమ్మ కాలనీలలో ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఐ నగర్ సమితి నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శులు రమణయ్య, ఆలిపిరాలు మంగళవారం అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకొని పేదలు నివాసం ఉన్నారని పేర్కొన్నారు.
అక్కడి ప్రజలకు రోడ్లు, కాలువలు కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్కడ వున్న ప్రతి ఇంటికి ఆధార్కార్డు, రేషన్కార్డులు వున్నవి. ప్రభుత్వం నుండి అన్ని పథకాలు అందుతున్నాయి అన్నారు. అక్కడ నివాసం వున్న ప్రజలకు ఇండ్లు నిర్మించుకోవాలంటే హౌసింగ్ ద్వారా ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగిందన్నారు. కానీ అక్కడ వున్న పేద ప్రజలకు ఇంటి పట్టాలు లేవని తెలియజేశారు.. హౌసింగ్ అధికారుల దగ్గరకు వెళ్ళి మేము ఇండ్లు నిర్మించుకొంటామంటే పట్టాలు అడుగుతున్నారు అని పేర్కొన్నారు.
తెలిపిన మూడు డివిజన్లలో పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయవలసినదిగా కోరడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సంతోష్, సీనా, లాయర్ శ్రీనివాసులు, పి మున్నాఫ్, ఆర్ సుందర రాజు, సి నాగప్ప, ఈ ప్రసాద్, ఎన్ జిలాన్ భాష, సి కాజా మొయిద్దీన్, ఎస్. పి ఖాజా హుస్సేన్, చాంద్ భాష, ఈ. నారాయణస్వామి, ఎస్. జమీర్ భాష, సి. రమణ తదితరులు పాల్గొన్నారు.