సి ఐ టి యు ఏపీ చేనేత కార్మిక సంఘం
విశాలాంధ్ర ధర్మవరం;; చేనేత కార్మికులను చేనేత పరిశ్రమను ఆదుకోవాలని సిఐటియు నాయకులు, ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా
సిఐటియు ఆఫీసు నందు విలేకరులతో
సిఐటియు మండల కన్వీనర్ జె.వి.రమణ, సిపిఎం నాయకులు బాషా, సిఐటియు మండల కో కన్వీనర్ అయూబ్ ఖాన్. మాట్లాడుతూ
దేశంలో ప్రధానమైన వృత్తి వ్యవసాయం తర్వాత
చేనేత పరిశ్రమ ప్రధానమైన పరిశ్రమ అని, గత ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో వ్యవసాయానికి సాగు సాయం కోసం ప్రతి సంవత్సరం ఉచితంగా 20 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ మన దేశంలో ప్రధానమైన వృత్తి అని, అటువంటి చేనేత వృత్తి ఈరోజు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోవడం జరిగిందని, చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడంతో కార్మికులు వలసల బాట పట్టుచున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది కార్మికులు అప్పుల బాధ భరించలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమని తెలిపారు. చేనేత పరిశ్రమకు అనుబంధ కార్మికులు రంగుల అద్దకాలు చేసేవారు, జాకార్డ్ కట్టేవారు, అచ్చులు కట్టేవారు, వార్పులు పట్టేవారు ,తదితర కార్మికులను కూడా చేనేత కార్మికులుగా గుర్తించి, వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేసి వారికి కూడా ప్రభుత్వం సంవత్సరానికి 24 వేల రూపాయల చొప్పున మంజూరు చేయాలి అని తెలిపారు. గత ప్రభుత్వం చేనేత కార్మికుల ఇబ్బందులను గుర్తించి, ప్రతి సంవత్సరం వారి బ్యాంకుల ఖాతాలోకి 24 వేల రూపాయలు జమ చేసేవారని, అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా కార్మికులను ఆదుకోవడం కోసం 24 వేల రూపాయలు కార్మికుల బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేయాలని,200 యూనిట్స్ వరకు విద్యుత్తును చేనేత కార్మికులకు ఉచితంగా ఇవ్వాలని, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ ను ధర్మవరంలో ఏర్పాటు చేయాలని, ఎన్ హెచ్ డి సి.ని పునరుద్ధరించి, రేషం వార్పు సబ్సిడీతో ఇవ్వాలని, సెంట్రల్ సిల్క్ బోర్డు ద్వారా కార్మికులకు పనిముట్లు అందజేసి చేనేతలను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు.
మహాత్మా గాంధీ బంకర్ యోజన పథకం ద్వారా ఆత్మహత్య చేసుకున్న ప్రతి చేనేతకార్మికుడి కుటుంబానికి 5 లక్షల రూపాయలు భీమా మంజూరు చేయాలని, కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని, ముద్ర రుణాలు మంజూరు చేయాలని ,ఒక లక్ష రూపాయలు వరకు రుణమాఫీ చేయాలని మొదలగు ప్రధానమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి చేనేత పరిశ్రమను, చేనేతకార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వానికి కార్మికుల తరఫున సిఐటియు, ఏపీ చేనేత కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. కార్మికులను ప్రభుత్వం ఆదుకోని పక్షంలో కార్మికులను కలుపుకొని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో
సిఐటియు మండల కో కన్వీనర్ ఆదినారాయణ, చేనేత సంఘం నాయకులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.