ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములో మంగళవారం ఉదయం ధర్మవరంలో భారీ వర్షపాతం నమోదు అయినట్లు ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ శాఖ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని ఏడు మండలాలలో కురిసిన వర్షపాతం వివరాలను వారు తెలియజేయడం జరిగింది. ఇందులో ధర్మవరం 62.4 మిల్లీమీటర్లు కాగా, కనగానపల్లిలో 4.6 మిల్లీమీటర్లు, చెన్నై కొత్తపల్లిలో 42.2 మిల్లీమీటర్లు, రామగిరి లో 46.4 మిల్లీమీటర్లు, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో వర్షపాతం కురవలేదని వారు తెలిపారు. మొత్తం ఏడు మండలాలలో 155.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురవడం జరిగిందని తెలిపారు. డివిజన్ పరిధిలో రమారమి 22.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని తెలిపారు. ఈనెల 14వ తేదీ కూడా అధికంగా వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ గోపాల్, డీఈవో సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.