ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పరిసరాలను మనం శుభ్రంగా పెట్టుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇంచార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో రెండవ రోజు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన శుభ్రతా కార్యక్రమంలో మంత్రి కార్యాలయ సిబ్బంది, బీజేపీ, టీడీపీ నాయకులు, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కలిసి పరిసరాలను శుభ్రం చేసారు. ఈ కార్యక్రమం అనంతరం, వారు మీడియాతో మాట్లాడుతూ,“ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజూ శుభ్రతా కార్యక్రమాలు నిర్వహించనున్నా మనీ, పరిశుభ్రత మన ఆరోగ్యంలో మూలస్తంభం అని తెలిపారు. మునుపటి కాలంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువైనందున, డ్రైనేజీ కాలువలను పరిశుభ్రంగా ఉంచడం కూడా అత్యవసరం”అని తెలిపారు.
అనంతరం, వారు స్థానిక సమాజాన్ని సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రయత్నంలో భాగస్వామ్యమయ్యేలా ఉండాలని, తద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి మార్గదర్శకం అవుతుందని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ సిబ్బంది,మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు శాంసన్, కేశవ, ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, టిడిపి నాయకులు పట్టణ అధ్యక్షులు పరిశ్ సుధాకర్, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, జింక రామాంజనేయులు, మిరియాల అంజి,హోటల్ మారుతి స్వామి, బీరే శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.