ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యం మన చెంతనే ఉంటుందని వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ లో భాగంగా ప్రిన్సిపాల్ తో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో రెండు రోజులు పాటు” స్వచ్ఛ పరిషర్ -స్వస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కళాశాల ఆవరణం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను, చిన్నచిన్న రాళ్లను, వేస్ట్ మట్టిని తొలగిస్తూ శ్రమదానం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి, కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే, మన ఆరోగ్యం మనవాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. అందుకే మన ఇంటి పరిశుభ్రముతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలని తెలిపారు. విద్యార్థులందరూ కూడా చదువుతోపాటు ఇలాంటి సామాజిక కార్యక్రమాలను అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.