బిజెపి మంత్రి కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబు.
విశాలాంధ్ర- ధర్మవరం ; పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని బిజెపి కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బిఎస్సార్ బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యాన్ని వీడి, శ్రద్ధను కనపరచాలని తెలిపారు. నులిపురుగులు సాధారణంగా “గెస్ట్రోఇంటెస్టినల్ ప్యరాసైట్స్” లేదా “ఇంటెస్టినల్ ప్యరాసైట్స్” తో సంబంధం ఉంటాయని, ఇవి ఆహారంలో, నీటిలో లేదా ప్రత్యక్ష పరిసరాల్లో ప్రవేశించి, కడుపులో జీవిస్తాయన్నారు. అందుకే, చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచడం, ఆహారం తీసుకునే ముందు మరియు తరువాత చేతులు బాగా శుభ్రపరచడం అవసరమని చెప్పారు. నులిపురుగులు శరీరంలో ఉన్నట్లు అనుమానిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించి, సరైన పరీక్షలు , నాణ్యమైన చికిత్స తీసుకోవాలని సూచించారు. అలాగే, సరైన వ్యాయామం, పోషకాహారంతో కూడిన ఆహారం, సరైన నిద్ర కడుపులో నులిపురుగుల పెరుగుదలను నివారించడంలో సహాయపడుతాయని పేర్కొన్నారు. అనంతరం పిల్లలకు నులిపురుగులు నివారణ కు సంబంధించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ పాఠశాల హెచ్ఎం ఉమాపతి, సిబ్బంది, ఆశా వర్కర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, బిజెపి నాయకులు డోల రాజారెడ్డి, డి. చెర్లోపల్లి నారాయణ స్వామి, బత్తలపల్లి మండల కన్వీనర్ వీరనారప్ప, సాకే ఓబులేష్, జింకా చంద్ర శేఖర్, బిల్లే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.