విశాలాంధ్ర -ధర్మవరం : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో గల రవీంద్రభారతిలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రాకింగ్ స్టార్ డాన్స్ అకాడమీ నిత్య ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుందని డాన్స్ మాస్టర్ అస్లాం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో భారత్ ఆర్ట్స్ సంస్థ వారు జాతీయ, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన సందర్భంలో వారి ఆహ్వానం మేరకు మా ధర్మవరం రాకింగ్ స్టార్స్ డాన్స్ అకాడమీ విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ ఆడిటోరియంలో మమ్ములను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని, మా ప్రదర్శన అందరికీ నచ్చడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అంతేకాకుండా మా నృత్య ప్రదర్శనలో నాట్య కళాకారులు పడుతున్న కష్టాలను ఒక మెసేజ్ ఓరియెంటెడ్ గా చేసిన నృత్యాన్ని అందర్నీ ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఈ నాట్య ప్రదర్శన లో, కళ్యాణ్, రాయుడు, తన్మాయ్,వందన, ప్రవీణ్, చరణ్య, గౌతమ్, కావ్య, గీతికా ఈ నాట్య ప్రదర్శన లో పాల్గొన్నారు.. అనంతరం నృత్య ప్రదర్శన చేసిన అందరికి రవీంద్ర భారతి వారు శాలువాతో ఘనంగా సత్కరించారు.. తదుపురిగా డాన్స్ మాస్టర్ అస్లాం కు యుంగ్ కళ రత్న అవార్డును సంస్థ వారు అందచేశారు… డాన్స్ మాస్టర్ అస్లాం మాట్లాడుతూ కళ అంటే ధర్మవరం, ధర్మవరం అంటేనే కళ అనే ధర్మవరo లో ఎందరో నాట్యం మీద ఆసక్తితో ఉన్నారని వారిని అన్నివిధాలుగా తీర్చాధిద్దాడమే తన లక్ష్యం అని, అలాగే నాట్యం నేర్చుకోవాలి అని ఆసిక్తితో ఉన్నవారికి పేద పిల్లలకు నా వంతుగా ఉచితంగా డాన్స్ నేర్పిస్తారని తెలియచేసారు.. అలాగే. నా తల్లి తండ్రులు కి నా పాదాభివందనలు అని తెలుపుతూ, నన్ను ఈ అవార్డు వచ్చేలా ఎంత గానో కృషి చేసిన నా విద్యార్థులకు, నాతోటి స్నేహితులు డాన్స్ మాస్టర్స్ ముందు ఉండి నడిపించిన లోకేష్, చంద్ర కి కృతజ్ఞతలు తెలియచేసారు.