విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కాలేజీ గ్రౌండ్లో శ్రీ శ్రీనివాస కళ్యాణం మహోత్సవ వేడుకలు లో భాగంగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మానస నృత్య కళా కేంద్రం గురువు మానస ఆధ్వర్యంలో వారి శిష్య బృందం అలరించిన నృత్య నాటకం, నృత్యము అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి లు మానసతో పాటు వారి శిష్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేస్తూ బహుమతులను పంపిణీ చేశారు. ఇందులో వెంకటేశ్వర స్వామి అలంకరణలో గురువు మానస వేషధారణ పట్ల ముఖ్య అతిథులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. గురువు మానస మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోనే కాకుండా ఇతర జిల్లాలలోనూ ఇతర రాష్ట్రంలోనూ మన సంస్కృతి కలలను ఇనుము చేస్తున్నానని, చిన్నతనం నుంచే తాను నృత్యం పట్ల ఆసక్తి చూపుతూ, విద్యార్థినీ విద్యార్థులకు కూడా ఈ భరతనాట్యము, కూచిపూడి తదితర నృత్యాలను నేర్పిస్తున్నారని తెలిపారు.