Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

చేనేత పరిశ్రమలో రాబంధుల భరతం పడతాం……

ముఖ్యమంత్రి, హ్యాండ్లూమ్ కమిషనర్ కు పిర్యాదు చేస్తాం

అక్రమార్కులకు అండగానిలుస్తున్నా అధికారులను ఉపేక్షించం.

సీపీఐ నియోజక వర్గ కార్యదర్శి ముసుగు మధు

చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం : చేనేత పరిశ్రమను కాపాడాల్సిన ఆ నేతన్నలే అక్రమార్గంలో పయనిస్తూ వాటిని నిర్వీర్యం చేస్తున్న వారి భరతం పడతామని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగుమధు, చేనేత కార్మికసంఘం జిల్లా ప్రధానకార్యదర్శివెంకటనారాయణ లు పేర్కొన్నారు. స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయలయం లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. చేనేత బిడ్డను అని చెప్పుకునే జింకా రామాంజినేయులు, ఆ పరిశ్రమపై ప్రేమ ఉంటే హ్యాండ్లూమ్స్ మగ్గాలు ఏర్పాటుచేసి ఎందరికో శాశ్వతం గా జీవనోపాదిని కల్పించవచ్చన్నారు. అలాకాకుండా అత్యంత టెక్నాలజీగల పవర్లూమ్స్ మాగ్గాలను ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా ఉత్పత్తులు నిర్వహిస్తూ, తోటి నేతన్నల కడుపు కొడుతున్నారన్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తుల వల్ల ఇప్పటికే చితికిపోయి న పరిశ్రమ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. తోటి చేనేత బిడ్డననీ చెప్పుకునే రామాంజినేయులు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను పిలిపించుకుని పనులు చేయించు కోవడానికి వారికి సిగ్గు అనిపించలేదా? అని వారు ప్రశ్నించారు. మల్బరీ నుంచి గుడ్డు, రేషం దాకా అక్కడే తయారు చేస్తున్నానంటున్నావ్.. అక్కడ తయారైన ఆ ధారాన్ని ఎక్కడికి తరలిస్తున్నావో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చేనేత చట్టం ఉల్లంఘించకపోతే ఆ దారంను తయారు చేసి స్వంత మగ్గాలకు వాడుతున్నారా? లేక ఎక్కడికి తరలిస్తున్నారో ఏం చేస్తున్నారో? ఇప్పుడిప్పుడే అవగతం అవుతోం దన్నారు. ఇలాంటి అక్రమాలు అరికట్టడానికి తిరుపతిలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాన్ని చేనేతకు పుట్టినిల్లు అయిన ధర్మవరంలో ఏర్పాటుచేయాలని ఎన్పోస్ట్మెంట్ కార్యాలయం ధర్మవారానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్పోస్ట్మెంట్ కార్యాలయాన్ని ధర్మవరంలో ఏర్పాటు చేసే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు. హ్యాండ్లూమ్ ఏడి బాలసుబ్రమణ్యం, తిరుపతి ఇన్ఫోర్స్మెంట్ ఆర్డిడి రాజారావు అక్రమార్కులతో లాలూచీపడి చేనేత వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. చేనేత పరిశ్రమకు కంఠకులుగా మారిన జింకారామాం జినేయులు లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు రాష్ట్ర హ్యాండ్లూమ్ కమిషనర్ను కలవడానికి విజయవాడ బయలుదేరుతున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ద్వారా రెండు, మూడు రోజుల్లో వారిని కలిసి పిర్యాదు చేయడానికి సన్నద్ధమయ్యామన్నారు. అవసరమైతే రామకృష్ణను ఆహ్వానించి, జింకా రామాం జినేయులు అక్రమాల పై ఆయన నిర్వహిస్తున్న చేనేత ప్రాజెక్టు వద్ద ధర్నాకు సిద్ధం చేస్టున్నామన్నారు. ఏది ఏమైనా చేనేత పరిశ్రమను గాడిన పెట్టకపోతే ధర్మవరం పట్టుకేంద్రం పట్టు సడలే ప్రమాదం ఉందన్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయం పై చేనేత మంత్రి సవితమ్మ , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించి, చేనేత పరిశ్రమను కాపాడి, పవర్ లూమ్స్ మగ్గాలపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు వెంకటస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి రమణ, చేనేత కార్మిక సంఘం కార్యవర్గ సభ్యులు ఆదినారాయణ, శ్రీధర్, శ్రీనివాసులు బాల రంగయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img