Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మానవ సేవకు ప్రతిరూపం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ..

శ్రీ సత్యసాయి జిల్లా వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్
విశాలాంధ్ర ధర్మవరం:: మానవ సేవకు ప్రతిరూపం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అని శ్రీ సత్యసాయి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కేశవ నగర్ లో గల (శ్రీ వాసవి బాలికల జూనియర్ కళాశాల ఎదురుగా) మెహర్ వైట్ హౌస్ నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, యువర్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్, కార్యదర్శి విశ్వనాథ్ మాట్లాడుతూ దేశస్థాయిలోనే ఇండియన్ రెడ్ క్రాస్ కు ఎంతో మంచి గుర్తింపు ఉందని, ఇండియన్ రెడ్ క్రాస్ సేవలను ధర్మవరం ప్రాంత ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతోనే రెడ్ క్రాస్ సొసైటీని స్థాపించడం జరిగిందన్నారు. ఈ శిబిరానికి నరాల సంబంధిత శాస్త్ర చికిత్స నిపుణులు-హైదరాబాద్ డాక్టర్ రవి ప్రకాష్, గుండె వ్యాధుల వైద్య నిపుణులు సుభాష్ చంద్రబోస్ శిబిర రోగులకు తగిన వైద్య చికిత్సలను అందించి, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వారు వివరించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ శిబిరంలో ఈసీజీ, ఎకో2డీ వైద్య పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. బిపి, గుండె జబ్బులు సంబంధిత లక్షణాలు ఉన్నవారు, పక్షపాతము, మూర్చా, మెడ నొప్పి, నడుము నొప్పి, సయాటికా, చేతులు, పాదములు తిమ్మర్లు, నరాల బలహీనత, మూతి వంకర తదితర సంబంధిత లక్షణములు గల వారికి కూడా వైద్య పరీక్షలను నిర్వహించి, తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. విలువైన వైద్య చికిత్సలకు ఉచితంగా చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో 60 మంది రోగులు పాల్గొనడం జరిగిందని, వారందరికీ డాక్టర్లు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగిందన్న. తొలుత రోగులకు అల్పాహారాన్ని కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన గుద్దిటి సోమదాసు, డాక్టర్లైన రవి ప్రకాష్, సుభాష్ చంద్రబోస్ లను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర కార్యదర్శి జయరాం కోశాధికారి బండి నాగేంద్ర, ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యులు, క్యాంపు చైర్మన్ డాక్టర్.సత్య నిర్ధారన్, చాంద్ బాషా, సి. కె. రామాంజనేయులు, వంకదారి మోహన్, గర్రె రమేష్ బాబు, డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img