శక్తి మైత్రి మహిళా సంఘం
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలో శక్తి మైత్రి మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ పై అవగాహన “మీకు తెలుసా” అనే ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇన్చార్జ్ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ హరి శ్రీనివాసులు, ఐసీటీసీ వైద్యాధికారి డాక్టర్ నజీర్ కలసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాలో హెచ్ఐవి సుఖ వ్యాధులు గురించి పరిజ్ఞానము అవగాహన పెంపొందించడానికి, సురక్షిత పద్ధతులు పాటించడానికి, హెచ్ఐవి ని ఉన్న వారి పట్ల వివక్షత తగ్గించేందుకే ఈ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందని తెలిపారు. తప్పనిసరిగా ప్రజల్లో అవగాహన కల్పించి తద్వారా ఎక్కువమంది హెచ్ఐవి పరీక్షలు చేసుకునేలా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అందుకే నాకు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఈ అవగాహన ర్యాలీని చేపట్టడం జరిగిందన్నారు. అంతేకాకుండా స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా ఈ అవగాహన ర్యాలీలో పాల్గొనడం జరిగిందని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వనిత వాణి తెలిపారు. తదుపరి వనిత వాణి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కుళాయి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా ఎయిడ్స్ మహమ్మారి నుంచి తమ జీవితాలను కాపాడుకోవాలని, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అవగాహన కల్పించి చైతన్యం చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శక్తి మైత్రి మహిళా సంఘం ప్రాజెక్టు డైరెక్టర్ రాధమ్మ, ప్రాజెక్టు మేనేజర్ నవీన్ కుమార్ రాయల్, డాక్టర్ శైలజ ఐ సి టి సి కౌన్సిలర్లు అరవింద్ కుమార్ ,ల్యాబ్ టెక్నీషియన్ భార్గవి, పిపి యూనిట్ లక్ష్మీనారాయణ, టీబీ అండ్ ఎస్ టి ఎస్ లు కిష్టప్ప, ఏఎన్ఎంలు, అవుట్ రిచ్ వర్కర్స్, ఆశా కార్యకర్తలు, పీర్ ఎడ్యుకేటర్స్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.