విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తవడంతో ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు గ్రామంలో బుధవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ‘ఇది మంచి ప్రభుత్వం’ బ్రోచర్‌ను ఇంటింటికీ అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వంద రోజుల్లో రూ.4 వేలు పింఛన్, దివ్వాంగులకు రూ.6 వేలు అందిస్తున్నామని టిడిపి పార్టీ సీనియర్ నాయకులు నెట్టెం రాంబాబు తెలిపారు. నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ప్రకటన, అనేక మంది పేదల ఆకలి తీర్చుతున్న అన్న క్యాంటీన్‌ల ఏర్పాటు జరిగిందన్నారు. వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు చేపడుతోందని వివరించారు.ఈ సందర్భంగా వంద రోజుల పాలనపై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ నాయకులు శివరాం, టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు రాజశేఖర్ గ్రామ కార్యదర్శి రమణ, సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు