శక్తి మైత్రి మహిళా సంఘం స్వచ్ఛంద సంస్థ
విశాలాంధ్ర ధర్మవరం:: హెచ్ఐవి,ఎయిడ్స్ పట్ల అవగాహన ఉండడం చాలా మంచిది అని ప్రాజెక్ట్ మేనేజర్ నవీన్ కుమార్ రాయల్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల ప్రభుత్వ మోడల్ కళాశాల యందు హెచ్ఐవి/ ఎయిడ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది? ఎలా వ్యాపించదు?, మరి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని విద్యార్థులకు తెలపడం జరిగిందని తెలిపారు. హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా సమాజంలో కలిసి జీవించాలని తెలిపారు. క్షయ వ్యాధి సంబంధం గూర్చి, సుఖ వ్యాధులు చికిత్స గురించి, కండోమ్ యొక్క ఉపయోగం గూర్చి తెలుపడం జరిగిందన్నారు. ఈ వ్యాధి పట్ల ఏ ఆర్ టి మందులు, ఏపీ ఎస్ఎసిఎస్ యాపు గూర్చి, టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి విద్యార్థులకు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మశ్రీ, ఉపాధ్యాయ బృందం, ఓ ఆర్ డబ్ల్యు కవిత తదితరులు పాల్గొన్నారు.