జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీకృష్ణుని జీవిత కథ అందరికీ ఆదర్శమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల గీతా మందిరం ఆలయము చెరువు కట్ట వద్ద గల శ్రీకృష్ణుని ఆలయానికి వారు ప్రత్యేక పూజలను నిర్వహించి, స్వామి వారి ఆశీస్సులను పొందారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.