విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణములోని బాల సదన్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగముల నియామకం కొరకు అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని బాలసదన్ వార్డెన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారత అధికారిని ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరుగుతాయని తెలిపారు. గడువు ముగిసిన పిమ్మట ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులు స్వీకరించబడువని తెలిపారు. ఉద్యోగమునకు దరఖాస్తు చేసుకున్న పత్రాలను పుట్టపర్తి లోని శ్రీ సత్యసాయి జిల్లా కార్యాలయము నందు ఇచ్చి రసీదు పొందాలని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు