జనసేన పార్టీ సీనియర్ నాయకులు అరిగెల భాస్కర్
ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
విశాలాంధ్ర ధర్మవరం; సమాజ సేవకై పాటుపడతామంటూ జనసేన పార్టీ సీనియర్ నాయకులు అరిగెల భాస్కర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.జనసేన నాయకులు అరిగెల భాస్కర్ ఆధ్వర్యంలో పట్టణంలో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు.వృద్దులకు పండ్లు,బ్రెడ్ లను పంచి పెట్టారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ యూత్ నాయకులు కోలా నాగార్జున,చిలకల సుధాకర్,శ్రీరాములు రాజ్ ప్రకాష్,విజయ్,దేవా,రాజా,డిజైనర్ దాము,సోము,జగదీష్,లోక్ నాధ్ బాబూ,శంకర్,పుల్లప్ప తదితరులు పాల్గొన్నారు.అనంతరం పవన్ కళ్యాణ్ బర్త్ డే కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.