దాదాపు 6 లక్షల వరకు నష్టం వాటిల్లింది.. ప్రభుత్వం ఆదుకొని, న్యాయం చేయాలని బాధితుడు బాబ్జాన్.
అంగట్లో పని చేసే షామీర్ భాష పెట్రోల్ పోసి అంటించిన వైనం.
ఎట్టకేలకు శామీర్ భాషను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన లడ్డు అంగడి యజమాని.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల ఏ బాబ్జాన్ అనే యజమాని యొక్క లడ్డు అంగడి గురువారం తెల్లవారుజామున పూర్తిగా దగ్ధమైంది. యజమాని బాబ్జాన్ మాట్లాడుతూ తాను గత ఎనిమిది సంవత్సరాలుగా లడ్డు అంగడి వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునే వాడినని తెలిపాడు. తదుపరి లడ్డు అంగడికి వర్కర్ల కొరత ఉండటంతో షామీర్ భాష అనే అతనిని నాలుగు సంవత్సరాలుగా తీసుకొని ఉన్నానని, నమ్మకంతో ఎంతో పని చేశాడని తెలిపారు. తదుపరి నా వద్ద 15 వేల రూపాయలు అప్పు తీసుకుని, అంగడిలో పనిచేయడానికి రాకుండా పది రోజులుగా తప్పించుకుంటున్నాడని తెలిపారు. తదుపరి అతని ఇంటికి వెళ్లి అప్పు విషయం అడగడం జరిగిందని, తదుపరి అంగడికి పనిచేయడానికి రావాలని తెలిపారు. కానీ షామీర్ భాష కక్ష సాధింపు చర్యతో అప్పు అడిగానని గురువారం తెల్లవారుజామున రెండు గంటల నుండి మూడు గంటల మధ్య తన షాపులో నేరుగా పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యాడని తెలిపారు. అనంతరం స్థానికులు నాకు సమాచారం ఇవ్వడంతో షామీర్ భాషను మరికొంతమంది సహాయంతో పట్టుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగిందని తెలిపారు. మొత్తం కొన్ని వస్తువులతో పాటు లడ్డుకు సంబంధించిన సామాగ్రి కూడా పూర్తిగా దగ్ధం కావడం జరిగిందని బాధను వ్యక్తం తీశారు. తొలుత విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయిందని అనుకున్నాను, తదుపరి నా షాపులో పనిచేసే షామీర్ భాష నే దగ్ధం చేశాడన్న విషయం నాకెంతో బాధను కలిగించిందని తెలిపారు. ఫైర్ 101 కు తెల్లవారుజామున పలుసార్లు ఫోన్ చేసిన వారు లిఫ్ట్ చేయలేదని తెలిపారు. ఎంతో ప్రయాసపడి నీటితో అగ్నిని ఆపడం జరిగిందన్నారు. తాను కొత్తపేటలో నివాసముంటు, ఎర్రగుంటలో తన లడ్డు ఫ్యాక్టరీను పెట్టడం జరిగిందని తెలిపారు. నా కుటుంబానికి పూర్తి ఆధారమైన లడ్డు అంగడి దగ్ధం కావడం నాకెంతో తీవ్ర ఆవేదనను కలిగించిందని, మరి కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలో నాకు అర్థం కావడం లేదని తెలిపారు. కావున వన్ టౌన్ పోలీసులు జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకొని షామీర్ భాష ద్వారా నాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా నన్ను ఆర్థిక సహాయంతో ఆదుకోవాలని కోరాడు. నైట్ బీట్ చేసే పోలీసులు ఈ ఘటనను పరిశీలించకపోవడం నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతోందని పలువురు వాపోతున్నారు. నైట్ బీట్ ను తూతూ మంత్రంగా కాకుండా, పక్కాగా అమలుపరిస్తే ఇటువంటి ఘటనలకు అవకాశం ఉండదని ప్రజలు తెలుపుతున్నారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.