మానస నృత్య కళాకేంద్రం అధ్యక్షురాలు మానస
విశాలాంధ్ర -ధర్మవరం : వరద బాధితులను ఆదుకుందాం, వారికి చేయూతనిచ్చి, వారి జీవనోపాధికి శ్రీకారం చుట్టాలని మానస నృత్య కళాకేంద్రం అధ్యక్షురాలు మానస తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజుల కిందట విజయవాడలో వరద రావడంతో విజయవాడ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు ఎదురవుతున్నారని, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఆరోగ్య విషయం తదితర సమస్యలతో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వారిని ఆదుకునేందుకు మానస నృత్య కళాకేంద్రం వారు దాతల ద్వారా సహాయాన్ని కోరుతున్నారు. వరదలు కారణంగా ఎన్నో వేల కుటుంబాలు అతలాకుతం అవ్వడం జరిగిందని, మానస నృత్య కళా కేంద్రం ట్రస్ట్ వారు విరాళాలు వసూలు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. విజయవాడ ప్రజలను ఆదుకోవడం మనందరి బాధ్యత సాటి మనిషి కష్టంలో ఉంటే జాలి పడటం కంటే సహాయ పడటం మానవత్వం అనిపించుకుంటుందని దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి అండగా మానస చారిటబుల్ ట్రస్టు ద్వారా కాస్త ఆర్థికంగా హార్దిక చేయుట అందించే ప్రయత్నం చేస్తున్నామని అందుకే పెద్దలు అన్నారు “జాలి చూపే హృదయం కన్నా, సాయం చేసే చేతులు మిన్న” అని తెలిపారు.మానవతా దృక్పథంతో అందరూ తమ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. నగదు రూపేనా సహాయ సహకారాలు అందించేవారు ఫోన్ పే నెంబర్ 9492004463 కు పంపాలని వారు తెలిపారు. ఈ సహాయ కార్యక్రమానికి అందరూ తమ వంతుగా సహాయం చేయాలని వారు కోరారు.