ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం:: కూటమి ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి టిడిపి నాయకులు, కార్యకర్తలు తీసుకెళ్లాలని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములో గల గాంధీ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో వారు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల మౌలిక అవసరాలను తక్షణమే గుర్తించాలని,
చేనేత కార్మికులకు వర్తించే విద్యుత్తు సబ్సిడీ,వర్క్ షెడ్ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేశాలా కృషి చేయాలని తెలిపారు.
నియోజకవర్గంలో గల ప్రజల మౌలిక అవసరాలను గుర్తించి, తక్షణమే పరిష్కరించాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలను పరిటాల శ్రీరామ్ దృష్టికి అర్జీల రూపంలో అందజేశారు. స్పందించిన పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ రాబోవు రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని, ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజల మన్నలను పొందుతామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు, అభిమానులు శ్రేయోభిలాషులు పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుక సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.