విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లాలోని కదిరి మండలం కటారి పల్లె యందు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో వేమన సాహితి యాత్రలో వేమన గురించి దాదాపు 50 మంది సాహితీ కవులు పాల్గొన్నారు. ఈ సాహితీ కార్యక్రమంలో వేమన గురించి స్వీయ కవితలను అందరూ చదివి వినిపించారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిన సాహితీ కవి, డాక్టర్ సత్య నిర్ధారణ స్వీయ కవితకు మంచి ఆదరణతో పాటు జీ రసం తరఫున అధ్యక్షులు చాంద్ బాషా జ్ఞాపకం అందజేసి ఘనంగా సన్మానించారు. నూతన సాహితీవేత కవులకు కార్యక్రమంలో ఘనంగా స్వాగత కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. కొత్త రచయితలతో వారు ఆలపించిన కవిత అందర్నీ ముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమం పట్ల అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.