జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి అనుపమ జేమ్స్
విశాలాంధ్ర- అనంతపురం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆద్వర్యం లో ఈ నెల 29న ఎయిడ్స్ నియంత్రణలో బాగంగా అవగాహన కల్పిస్తూ 5 కె రెడ్ రన్ మారథాన్ విజయవంతం చేయాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అదికారి డా. అనుపమ జేమ్స్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్బంగా డా. అనుపమ జేమ్స్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ మారథాన్ నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు . ఈ 5 కె రెడ్ రన్ మారథాన్ ఈ నెల 29 న ఉదయం 6.30 గంటలకు ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ నుంచి ప్రారంభమై టవర్ క్లాక్ ,సప్తగిరి సర్కిల్ ,సర్వజన ఆసుపత్రి,కోర్టు రోడ్డు మీదుగా తిరిగి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ చేరుకుంటుందని తెలియజేశారు . 17-25 ఏళ్ల వయస్సు కలిగిన పురుషులు,స్రీలు ,ట్రాన్స్ జెండర్స్ విద్యార్థులు, రెడ్ రిబ్బన్ క్లబ్ మెంబర్స్ఇందులో పాల్గనటానికి అర్హులు అన్నారు . విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆయా కళాశాలల ప్రిన్సిపల్ వద్ద నుంచి దృవీకరణ పొంది ఈ మారథాన్ లో పాల్గొనాలన్నారు.