విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని ఏలుకుంట్ల నేలకోట గ్రామాలలోని ప్రత్యామ్నాయ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి ముస్తఫా ఆకస్మికంగా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ గ్రామంలోని స్టాక్ వివరాలను పరిశీలించి, అర్హులైన రైతులందరికీ సజావుగా పంపిణీ చేయవలసినదిగా రైతు కేంద్ర, రైతు సేవా కేంద్రం సిబ్బంది నాగరాజుకు, గీతాంజలి కు ఆదేశించారు. విత్తనం తీసుకున్న రైతులందరూ తప్పనిసరిగా విత్తుకోవలసినదిగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.