విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని శ్రీ తోగట వీర క్షత్రియ సేవా సంఘములో పట్టణ అధ్యక్షులుగా పనిచేస్తున్న బండారు ఆదినారాయణ అదే విధంగా ప్రధాన కార్యదర్శి శంకర యుగంధర్ అను వీరు పదవీకాలం ముగిసినదని, అందుకే తాము రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ మా రాజీనామాను కార్యవర్గ సభ్యులు ఆమోద పరుస్తూ, నూతన కమిటీ కొరకు ఆసక్తిగా గల తొగట వీర క్షత్రియ కులస్తులు ఎవరైనా సరే అధ్యక్ష పదవిని స్వీకరించాలని వారు తెలిపారు.