కళాశాల చైర్మన్ బండి వేణుగోపాల్
విశాలాంధ్ర -ధర్మవరం:: దాతల సహకారంతోనే విద్యార్థినీలకు భోజనమును పంపిణీ చేస్తున్నామని కళాశాల చైర్మన్ బండి వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తోంది అని, ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా దాతల సహకారంతో భోజనమును పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అనంతరం 450 మంది విద్యార్థినీలకు కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి చేతులు మీదుగా భోజనాన్ని వడ్డించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీలు పాల్గొన్నారు