విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్ వద్ద గల అరగల పోతన హాస్పిటల్ నందు ఈనెల 28వ తేదీన బెంగళూరు సాగర్ హాస్పిటల్ వారిచే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎముకలు కీళ్లకు సంబంధించిన వ్యాధులకు సాగర్ హాస్పిటల్ ప్రత్యేక బిందెముచే వైద్య చికిత్సలను అందించబడునని ఆరోగ్యంగా పోతున్న హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ గణేష్ తెలిపారు. ఈ వైద్య చికిత్సలను బెంగళూరులోని ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ హేమంత్ చే నిర్వహించబడునని తెలిపారు. నడుము, భుజము, మెడ, వెన్ను, మోకాళ్లు ,మెడమీ నొప్పులకు సయాటికా ఆస్ట్రియా పోరోసిస్, కీళ్లవాతం కీళ్ల మార్పిడి మక్కి మార్పిడి తదితర వ్యాధులకు సరియైన వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్య సూత్రాలు కూడా తెలపబడునని తెలిపారు. కావున ఈ సదవకశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.