బ్యాంకు పర్సన్ ఇంచార్జ్ రాజేంద్రప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల టౌన్ బ్యాంక్ అభివృద్ధికి సభ్యులు సహకరించాలని బ్యాంక్ అఫీషియల్ పర్సన్ ఇంచార్జ్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. వీరి ఆధ్వర్యంలో బ్యాంకు నందు మహాజన సమావేశమును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సహకార అధికారి కృష్ణానాయక్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 2023-24 సంవత్సరపు వార్షిక ఆడిట్ రిపోర్టును ఆమోదించడం కొరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సభ్యుల యొక్క షేర్ మొత్తమునకు 8 శాతం డివిడెండ్ ప్రకటించడం జరిగిందని తెలిపారు. సభ్యులందరూ బ్యాంకుకు వచ్చి డివిడెంట్ మొత్తమును తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా బ్యాంకు అభివృద్ధికి కు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు కార్యదర్శి సుధీర్ నాథ్ రెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.