విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని నూతన టూ టౌన్ సిఐ గా రెడ్డప్ప బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో (ఎంఎండిఏ) నాయకులు శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు రోషన్ జమీర్, నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ దాదా పీర్ లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం తో శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణ సమస్యలను వారికి వివరించారు. తదుపరి సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ ప్రజలందరికీ న్యాయపరంగా న్యాయం చేస్తారని వారు తెలిపారు.