విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని మున్సిపల్ కార్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆర్. మల్లికార్జున (48 సంవత్సరాలు) ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈనెల 4వ తేదీన ఎర్రగుంట వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో స్థానికులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తదుపరి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు, అక్కడ చికిత్సలు పొంది తిరిగి బత్తలపల్లి మండలం ఆర్డిటి హాస్పిటల్ లో వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం వైద్య చికిత్సలు పొందుతూ హఠాత్తుగా మృతి చెందారు. మృతునికి భార్యతో పాటు ఇతరు పిల్లలు కూడా కలరు. సమాచారం అందుకున్న శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్యాంశన్ ,కేశవ, తోటి వర్కర్లు తమ సంతాపాన్ని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు, బంధువులు, కుటుంబ సభ్యులు కోరుతున్నా రు.