Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

మున్సిపల్ ఉపాధ్యాయులకు పదోన్నతులను కల్పించాలి..

ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సానే రవీంద్రారెడ్డి
విశాలాంధ్ర- ధర్మవరం:: మున్సిపల్ ఉపాధ్యాయులకు పదోన్నతులను కల్పించాలని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సానే రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో సానే రవీంద్రారెడ్డి, పట్టణ శాఖ గౌరవ అధ్యక్షులు, కార్యదర్శులు నాగప్ప, జగదీష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నందున జీవో నెంబర్ 117 ను వెంటనే రద్దుచేసి, మున్సిపల్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న వర్క్ అడ్జస్ట్మెంట్ పూర్తిగా అసంబంధంగా ఉన్నదని, ఎస్జీటీలకు తమకిష్టమైన పాఠశాలను ఎన్నుకునే అవకాశం ఈ విధానములో లేదని ఎస్జీటీలతో ఉన్నత పాఠశాలలో విద్యాబోధన చేయించడం వల్ల నాణ్యమైన విద్యను ఎలా చేకూరుతుందని వారు ప్రశ్నించారు. మున్సిపల్ విద్యావ్యవస్థకు గొడ్డలిపెట్టుగా ఉన్న జీవో నెంబర్ 84 ను రద్దు చేయాలని ప్రత్యేకించి ధర్మవరం మున్సిపాలిటీలో తీవ్రమైన ఉపాధ్యాయుల కొరతను తీర్చే విధంగా తక్షణం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట రాముడు, కాజా మొహీబ్, శ్రీనివాసులరెడ్డి, బషీర్ అహ్మద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img