కేసులను సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి
: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర- అనంతపురం : కంటెంప్ట్ కేసులను సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ వివిధ శాఖల జిల్లా అధికారులను, ఏఓలు, సూపరింటెండెంట్ లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ కోర్టు కేసులపై వివిధ శాఖల జిల్లా అధికారులతో, ఏ.ఓ లు, సూపరింటెండెంట్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కంటెంప్ట్ కేసులు కోర్టులో నమోదైన వెంటనే చొరవ తీసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. మీ శాఖలకు సంబంధించిన కోర్టు కేసులను ప్రతిరోజు పరిశీలించాలన్నారు. మీరు అలసత్వం వహిస్తే ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని, అలాగే మీ శాఖలకు సంబంధించి కేసులలో జిల్లా కలెక్టర్ పార్టీగా ఉన్నారో అలాంటి కేసులను ప్రతిరోజు తానే స్వయంగా పరిశీలిస్తానన్నారు. ప్రతి శాఖ వారు కోర్టు కేసుల జాబితాను తయారు చేసుకోవాలని, ప్రతి కోర్టు కేసుకు సంబంధించి ఈ ఆఫీస్ ఫైలు ఉండాలని, అందులో నోటీస్, కోర్ట్ ఆర్డర్, స్పీకింగ్ ఆర్డర్ తదితర విషయాలను ఈ ఆఫీస్ నందు పొందుపరచాలని సూచించారు. అలా చేయడం వల్ల ఫైల్స్ మిస్ కాకుండా భద్రంగా ఉంటాయని తెలిపారు. కేసులకు సంబంధించి పేరా వైజ్ రిమార్క్స్ పంపేటప్పుడు ఒ ఎల్ సి ఎం ఎస్ లో కూడా అప్లోడ్ అవ్వాలని, అలాగే సంబంధిత జిపికి మెయిల్ ద్వారా కూడా పంపాలని, ప్రతి ఒక్కరూ వారికి సంబంధించిన జిపి మెయిల్ ఐడి ఫోన్ నెంబర్లను తమ వద్ద ఉండాలని ఆదేశించారు. ప్రతిరోజు మీరు (ఆన్లైన్ లీగల్ కేస్ లోడ్ మేనేజ్మెంట్ సిస్టం ) చెక్ చేస్తూ ఉండాలని తెలిపారు. కోర్టు కేసులకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయం అడిగే సమాచారాన్ని వెంటనే స్పందించి సమాచారాన్ని అందించాలని తెలిపారు. కోర్టు కేసులను మధ్యలో వదిలేయకుండా పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా చూడాలని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్క అధికారి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఏ ఓ లు, సూపరింటెండెంట్లి, సీనియర్ సహాయకులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.