విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలో శాంతిభద్రతలను నెలకొల్పడం, ప్రజా సమస్యల పరిష్కారణకై తన వంతు కృషి చేస్తానని టూ టౌన్- సిఐ. రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. తొలుత అర్చకులు ద్వారక నాథ్ ద్వారా స్టేషన్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత, వారి ఆశీస్సులను పొందారు. అనంతరం సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్కు బదిలీగా వచ్చినట్లు వారు తెలిపారు. స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బందితో సమన్వయంతో పని చేస్తూ, కేసుల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పట్టణములో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ప్రశాంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై, మట్కా, జూదం, గంజాయి, అక్రమ మద్యం రవాణా తదితర లాంటిపై ప్రత్యేక నిఘాలు ఉంచడం జరుగుతుందని తెలిపారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన సీఐ రెడ్డప్పకు శుభాకాంక్షలు తెలియజేశారు.